
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)లో రూ.150 కోట్ల నగదు బదిలీకి సంబంధించి అవకతవకలు జరిగాయని కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివరెడ్డి ఆరోపించారు.
ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ నిధుల బదిలీ జరిగిందని ఆయన పేర్కొంటూ, మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం ప్రస్తుతం న్యాయవాద సంఘంలో చర్చనీయాంశంగా మారింది.