జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు క్రమశిక్షణతో ఉండాలని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని, ప్రత్యర్థుల ట్రాప్‌లో పడకుండా కూటమి ధర్మాన్ని పాటించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడుకోవాలని, సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.