
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్లో విచారణ కొనసాగించారు.
సీబీఐ హైదరాబాద్ ప్రాంతీయ స్టేషన్ అదనపు ఎస్పీ సీహెచ్వీ నరేంద్రదేవ్తో పాటు డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మొత్తం పది మందికి పైగా దర్యాప్తులో ఉన్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న గులివిందల సురేష్కుమార్, కోనేటి వెంకటరాజు ఇళ్లలో ఆదివారం సోదాలు చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు.