
ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపునకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సోమవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు.
ఎన్నికల సంఘం తీరుపై వ్యక్తమవుతున్న నిరసనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.