
నాట్కో ఫార్మా జూన్ త్రైమాసికంలో రూ.206 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 57.01 శాతం తక్కువ.
అమెరికాలో లెనాలిడోమైడ్ విక్రయాల రాబడి తగ్గడం వల్ల కంపెనీ ఆదాయం 42.87 శాతం క్షీణించి రూ.794.40 కోట్లకు పరిమితమైంది.
కంపెనీ బోర్డు ఒక్కో షేరుపై రూ.1.50 డివిడెండ్‌ను ప్రకటించడంతో పాటు రూ.2,000 కోట్లు సమీకరించేందుకు ఆమోదం తెలిపింది.