
తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతారు, దీనికి సంబంధించిన ఒప్పందం సోమవారం టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య జరిగింది.
ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ‘ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్’ ద్వారా 900కు పైగా డిజిటల్ కోర్సులు ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి, అలాగే గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షలకు డిస్కౌంట్ వోచర్లు, జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తారు.