
స్పేస్ ఎక్స్ సంస్థ శనివారం 27 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడంతో, ఈ ఏడాదిలో 100వ ఫాల్కన్ రాకెట్ ప్రయోగాన్ని పూర్తి చేసి చారిత్రక మైలురాయిని అందుకుంది.
ప్రస్తుతం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న స్టార్‌లింక్ యాక్టివ్ ఉపగ్రహాల సంఖ్య 11,000 దాటిందని, భవిష్యత్తులో ఈ సంఖ్యను లక్షకు చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
రాకెట్ల పునర్వినియోగం ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించవచ్చని, ఇది అంతరిక్ష చరిత్రలో భారీ మార్పులకు దారితీస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.