1968లో ప్రభుత్వం తెచ్చిన గోల్డ్ కంట్రోల్ యాక్ట్ వల్ల బంగారం దిగుమతులు తగ్గినా, అక్రమ రవాణా పెరిగి 1990 వరకు ఈ చట్టం కొనసాగింది.
1991 ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి 46.91 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందింది.
ప్రస్తుతం ఆర్బీఐ వద్ద రికార్డు స్థాయిలో 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, ఇది దేశ ఆర్థిక భద్రతలో కీలక ఆస్తిగా మారింది.