
ఆగస్టు చివరి వారంలో పుంజుకున్న పసిడి అమ్మకాలు పండగల సీజన్లో ఇటీవల బాగా తగ్గాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో పసిడి ధర దిగుమతి ధర కంటే దాదాపు 2 శాతం తక్కువగా లభిస్తోందని, ఔన్స్‌కు 78 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ కవితా చాకో తెలిపారు.
అయితే రానున్న పండగలు, పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కారణంగా డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.