
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టాబ్లెట్ ఇండియా లిమిటెడ్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడులో ఐదుగురు మృతి చెందారు.
ఈ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.