
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్కు తెలుగు దంపతులు అనురాధ, వికాస్ సిన్హా రూ.191 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఈ నిధులతో యూనివర్సిటీలో 'అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్' పేరుతో కొత్త విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతికి చెందిన ఈ దంపతులు గతంలో కూడా డేటా సైన్స్ విభాగం అభివృద్ధికి 2.15 మిలియన్ డాలర్ల సహాయం అందించారు.