
జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించి ఈ సీజన్లో రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ లైన్ హోజ్మార్క్ క్జెర్స్ఫెల్డ్పై 21-12, 21-14 తేడాతో 39 నిమిషాల్లోనే సింధు గెలుపొందింది.
ఈ విజయంతో 9,200 ర్యాంకింగ్ పాయింట్లు సాధించి సీజన్ ముగింపు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే దిశగా ముందడుగు వేసింది.