ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కలిగే ఒత్తిడితో కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లు విడుదలై ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, బ్లాక్ కాఫీలోని కెఫెన్, తగినంత నిద్రలేకపోవడం, ఉదయం అల్పాహారం మానేయడం వంటివి షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయి.
శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) మరియు నాసల్ స్ప్రేలలోని రసాయనాలు కూడా కాలేయాన్ని ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.