
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.
అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరుగనున్న ఈ భేటీలో కూటమి పార్టీలు ఏయే స్థానాల నుంచి బరిలోకి దిగనుందనేది ఖరారు కానుంది.
నేడు రిజర్వేషన్లు ఖరారు కానుండటం, అక్టోబర్ 14న స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.