
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాళెం వద్ద 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.