
ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల పీజీ హాస్టల్ భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.
సుమారు 75 పడకల సామర్థ్యం ఉన్న ఈ భవనం 40-50 ఏళ్ల నాటిదని, ప్రమాద సమయంలో బేస్‌మెంట్‌లో మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, 11 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.