
రష్యా ఉప ప్రధానమంత్రి మరాత్ ఖుస్నుల్లిన్ తుర్క్‌మెనిస్థాన్, ఇరాన్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ల మీదుగా హిందూ మహాసముద్రాన్ని కలిపే కొత్త రైల్వే కారిడార్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
ఈ మార్గం ద్వారా చమురు, ఎరువులు, పారిశ్రామిక ఉత్పత్తులను దక్షిణాసియాకు తరలించవచ్చని, ఇది చైనా సీపీఈసీ ప్రాజెక్టుకు గట్టి పోటీనిస్తుందని రష్యా భావిస్తోంది.
అఫ్ఘనిస్థాన్‌లో అనిశ్చితి, పాకిస్థాన్‌లో భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ, ఇది భారత్‌కు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా నిలిచే అవకాశం ఉంది.