
హెచ్5ఎన్1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్నందున, చనిపోయిన పక్షులను తాకకుండా స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ముఖ్యంగా పౌల్ట్రీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
చికెన్, గుడ్లను పూర్తిగా ఉడికించి తినడం ద్వారా వైరస్ ముప్పును తగ్గించుకోవచ్చని, పచ్చిగా లేదా సరిగా ఉడికించని పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోకూడదని స్పష్టం చేశారు.