
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వంద పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అజేయంగా 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఆడితే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని ఈ మ్యాచ్ నిరూపించిందని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు.