
హైదరాబాద్కు చెందిన 184 మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో 36.4 శాతం మంది జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశలో ఉన్నట్లు ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ గుర్తించింది.
రక్తంలో విటమిన్ డి, బి2, బి9 లోపాలు ఉన్నవారిలో మెదడు పనితీరు మందగిస్తున్నట్లు పరిశోధనలో తేలింది.
మధుమేహం, రక్తపోటు ఉన్న వృద్ధులు పోషకాహార భద్రతపై దృష్టి సారించాలని, సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.