దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 కాక్పిట్లో కో-పైలట్ దాడికి పాల్పడగా, ఆ ఘటనను యూఏఈ, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ఉగ్రవాద కుట్రగా అభివర్ణించాయి.
నిందితుడు హమామ్ అల్-హమ్మమీ గతంలో ఇంటర్నెట్లో ఉగ్రవాద వెబ్సైట్లను వీక్షించినట్లు గుర్తించి, ఒమాన్ అతన్ని తమ దేశంలో ఏవియేషన్ రంగానికి దూరంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఫైదుబాయ్లో ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఒమాన్ భద్రతా దళాల నుంచి ఎలాంటి సమాచారం కోరలేదని, ఒకవేళ అడిగి ఉంటే పూర్తి వివరాలు పంచుకునేవాళ్లమని ఒమాన్ వర్గాలు వెల్లడించాయి.