
రాష్ట్రంలో అతి తీవ్ర తుపాను 'ఆర్నబ్' ముప్పు నేపథ్యంలో తీరప్రాంత ప్రజల తరలింపునకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
ఈ కేంద్రాలలో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందించాలని, అత్యవసర సహాయం కోసం 1070, 112 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.