
ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో మదనపల్లెకు చెందిన వైసీపీ నాయకురాలు కోనేటి సులోచన ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి 15 పత్రాలను సీజ్ చేశారు.
2023లో నమోదైన చీటింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా, సులోచన తన పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న 50 రకాల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఖాళీ బాండ్ పేపర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.