
తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా జి. బాలకృష్ణ 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో 502 మంది ఓటర్లకు గాను కేవలం 114 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోగా, మెజారిటీ సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
టాలీవుడ్ పెద్దల సూచనలను కాదని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడంపై అసోసియేషన్ వర్గాల్లో తీవ్ర వివాదం నెలకొంది.