
ఉద్యోగం చేస్తూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారి కోసం ఐఐటీ దిల్లీ సరికొత్త సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంశాలపై ఈ కోర్సును రూపొందించారు.
ఉద్యోగంలో ఉన్నవారు తమ వృత్తికి ఆటంకం లేకుండా ఈ కోర్సు ద్వారా శిక్షణ పొందే అవకాశం ఉంది.