
వర్షాకాలం కావడంతో విజయవాడ మార్కెట్‌లో నాటు పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ పెరిగి, ఒక్క కట్ట రూ. 500 ధర పలుకుతోంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సేకరించిన ఈ సహజ పుట్టగొడుగులను రుచి కోసం వినియోగదారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
సూపర్ మార్కెట్లలో లభించే సాధారణ మష్రూమ్‌ల కంటే వీటి రుచి, సువాసన భిన్నంగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.