
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జరుపుతున్న రహస్య చర్చలు బిలియన్ డాలర్ల భారీ చమురు ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
రష్యా ప్రైవేట్ ఇంధన దిగ్గజం లూకోయిల్ సంస్థకు చెందిన ప్రపంచవ్యాప్త చమురు క్షేత్రాలు, రిఫైనరీలు మరియు గ్యాస్ స్టేషన్ల నెట్‌వర్క్ ఈ డీల్‌లో ప్రధాన భాగంగా ఉన్నాయి.
గత సెప్టెంబర్ 5న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా సంధానకర్తలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లు జరిపిన భేటీలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం.