
పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ దేశంలోని నాలుగు ప్రధాన ప్రావిన్సులను రద్దు చేసి, వాటిని 12 నుంచి 160 వరకు చిన్న యూనిట్లుగా విభజించేందుకు సిద్ధమయ్యారు.
పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ప్రధాన రాజకీయ పార్టీలకు బలమైన కోటలుగా ఉండటంతో, రాజకీయ శక్తుల వెన్ను విరిచి అధికారాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడానికే మునీర్ ఈ పథకానికి తెరలేపారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ విభజన పాకిస్థాన్ ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.