
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు రెండు టెస్టుల సిరీస్ కోసం మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది.
ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా, గాయం కారణంగా యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టుతో పాటు వెళ్లలేదు.
సుదర్శన్ ఫిట్నెస్ సాధించకపోతే, ఆగస్టు 7 నుంచి జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమై, తుది జట్టులో దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.