
సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ రెండో రౌండ్లోనే అర్జెంటీనా ప్లేయర్ థియాగో టిరంటే చేతిలో ఓటమి పాలయ్యాడు.
తొలి సెట్ గెలిచిన జకోవిచ్, ఆ తర్వాత రెండు సెట్లను 2-6, 6-4, 6-4 తేడాతో కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
అమెరికాలో ఉన్న తీవ్రమైన ఎండల కారణంగా జకోవిచ్ అనారోగ్యానికి గురై వాంతులు చేసుకున్నట్లు టెన్నిస్ వర్గాలు పేర్కొన్నాయి.