
భారత్తో ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ చాలా హోరాహోరీగా సాగిందని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపారు.
తమ జట్టు 3-2తో సిరీస్ కోల్పోయినప్పటికీ, ఈ సిరీస్ నుంచి ఎన్నో సానుకూల అంశాలను నేర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తమ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించిందని శాంట్నర్ కొనియాడారు.