
బంగ్లాదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు మహమ్మద్ యూనస్ అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు ప్రవాస బంగ్లాదేశీయులు ఆయనను అడ్డుకున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, తన పాలనలో జరిగిన ప్రాణ నష్టానికి ఆయనే బాధ్యుడని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 12న దోహా నుంచి ఖతార్ ఎయిర్వేస్ విమానంలో ఆయన న్యూయార్క్ చేరుకున్నట్లు 'డైలీ సన్' పత్రిక వెల్లడించింది.