
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వృద్ధి వ్యూహంలో భాగంగా సాఫ్ట్వేర్ కంపెనీ Monday.com మొత్తం ఉద్యోగుల్లో 20% మందిని, అంటే దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
2026 ప్రారంభం నుంచే అమెరికా టెక్ కంపెనీలు దాదాపు 1 లక్ష 40 వేల ఉద్యోగాలను తొలగించాయి, ఇందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి.
AI పేరుతో కంపెనీలు చేస్తున్న ఈ కోతలను మార్కెట్ పూర్తిగా నమ్మడం లేదని, AI స్కిల్స్ ఉన్న వారికి కొత్త అవకాశాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.