
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ నిరాకరించింది.
నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో వాదించారు.
అనంతబాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్, మహాలక్ష్మిల బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది.