
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో 55కు పైగా అజెండా అంశాలపై చర్చించగా, 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల, మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల చట్ట సవరణ వంటి కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, పరిశ్రమలు మరియు ఇంధన రంగ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.