
దర్శకుడిగా పరిచయమవుతున్న జేసన్ సంజయ్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్తో తన తండ్రి విజయ్ కలిసి నటించాలని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు.
నటనపై ఆసక్తి లేకపోవడంతో కెనడాలో ఫిలింమేకింగ్లో శిక్షణ తీసుకున్న జేసన్ సంజయ్, ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తన తండ్రిని డైరెక్ట్ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన జేసన్, దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తాయని తనకు ముందే తెలుసని సరదాగా వ్యాఖ్యానించారు.