
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఉదయం 11.30 గంటలకు అక్షర విద్యాలయం హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడ అక్షర విద్యాలయం మరియు సోమా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఆయన సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గం ద్వారా స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకుని యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.