
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆకుల జగదీశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.
1996లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన ఆయన, 2005-2010 మధ్య మండల రిసోర్స్ పర్సన్‌గా బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంలో కీలక పాత్ర పోషించారు.
గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించి అధికారులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు.