హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లు పొందిన వారు తొలి విడతగా రూ.లక్షను ఈనెల 9వ తేదీలోగా చెల్లించాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది.
మొత్తం 5,501 మందికి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయగా, ఇప్పటివరకు 3,271 మంది మాత్రమే చెల్లింపులు పూర్తి చేశారు.
గడువులోగా డబ్బులు చెల్లించని వారి తాత్కాలిక కేటాయింపులు రద్దు చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.