
జీర్ణవ్యవస్థలోని గట్ మైక్రోబయోటా బ్యాక్టీరియా సమూహం ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
స్వీడన్లోని ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు 674 మందిపై జరిపిన అధ్యయనంలో, 19 రకాల మెటాబోలైట్లు ఊబకాయంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు.
బ్లాటియా, డోరియా వంటి నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఊబకాయానికి కారణమయ్యే మెటాబోలైట్లతో సంబంధం కలిగి ఉన్నాయని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు తెలిపారు.