
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శివారులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని దుర్వినియోగం చేసి నకిలీ పోలీస్ ఐడీ కార్డును సృష్టించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డమ్ డమ్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లి తాను పోలీస్ అధికారినని చెప్పి కారు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బెదిరింపులకు దిగాడు.
పోలీసులు అనుమానించి ఐడీ కార్డును స్కాన్ చేయగా అది నకిలీదని తేలడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.