
టెలికాం కంపెనీలు ఇకపై తప్పనిసరిగా 30 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
డేటా అవసరం లేని వారి కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్లను కూడా అందుబాటులో ఉంచాలని 'టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్, 2026' ద్వారా నిర్దేశించింది.
వినియోగదారుల ఫిర్యాదుల మేరకు రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మార్చి 11న పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఈ మార్పుల వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు.