
అసలే గుండెజబ్బుతో బాధపడుతున్న వారికి ఫ్లూ, న్యుమోనియా, కొవిడ్ వంటి ఇన్ఫెక్షన్లు తోడైతే సమస్య మరింత ఉద్ధృతమవుతుంది.
ఇలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల అప్పటికే ఉన్న గుండె వైఫల్యం, పూడికల సమస్యలు మరింత భారంగా మారుతాయి.
ఈ అనారోగ్య ముప్పుల నుంచి రక్షణ పొందడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయి.