
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని కారాకారా పబ్‌లో టేబుల్ విషయంలో తలెత్తిన వివాదం 50 మంది యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ గొడవలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ తెరిచి ఉంచినందుకు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.