
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంట్రోల్ ఎస్ డేటాసెంటర్స్ సంస్థలో రూ.250 కోట్ల కొత్త పెట్టుబడులు సమకూరాయి.
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ రూ.200 కోట్లు, ఏంజెల్ ఇన్వెస్టర్ శ్రీరామ్ రెడ్డి వంగా రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టారు.
ఏఐ సాంకేతికత వల్ల పెరిగిన డేటా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు.