
ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బోడోనో 100 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో పరిగెత్తి, క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్‌తో బంతిని వేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ క్యాన్సర్ చారిటీ కోసం 6 వేల పౌండ్ల నిధులను సేకరించే లక్ష్యంతో ఈ సాహసాన్ని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుండి ప్రారంభించాడు.
గతంలో టామ్ డున్ పేరిట ఉన్న 24 కిలోమీటర్ల రన్-అప్ రికార్డును సామ్ బోడోనో అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పాడు.