
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక ఇంటి యజమాని, అద్దెకు ఉన్నవారి మధ్య వివాదంలో ఒకరికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.
లంచం తీసుకున్నట్లు వీడియో ఆధారాలు చూపించి బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు.