
కెనరా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో గత ఏడాది కంటే 2 శాతం వృద్ధితో రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 39,684 కోట్లకు పెరగగా, నికర వడ్డీ ఆదాయం (NII) తొలిసారిగా రూ. 10,000 కోట్లు దాటి రూ. 10,215 కోట్లకు చేరుకుంది.
స్థూల మొండి బకాయిలు (NPA) 2.69 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గాయని, ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్ల ద్వారా 130 కోట్ల డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎండీ బ్రజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.