
సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్‌లైన్ వ్యవస్థపై గురువారం దాడి జరగగా, ముందుజాగ్రత్త చర్యగా కార్యకలాపాలను నిలిపివేశారు.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని, పంపింగ్ స్టేషన్ల వద్ద భారీగా మంటలు చెలరేగి దట్టమైన నల్ల పొగలు వెలువడినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.
ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లతో దాడి జరిగి ఉండొచ్చని అమెరికా వర్గాలు అంచనా వేస్తుండగా, చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.