
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'రెంటల్ బాయ్‌ఫ్రెండ్' ఆఫర్లు సైబర్ మోసాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
కాఫీ డేట్ కోసం రూ.499, సినిమా డేట్ కోసం రూ.1,249, ఫుల్ డే ప్యాకేజీ కోసం రూ.4,499 అంటూ సైబర్ కేటుగాళ్లు యువతులను ట్రాప్ చేస్తున్నారు.
అపరిచిత వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, వ్యక్తిగత వివరాలు లేదా ఫొటోలు షేర్ చేస్తే బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు సూచించారు.